Seethakka: బిఆర్ఎస్ సర్కార్ వల్లే సర్పంచ్ బిల్లులు పెండింగ్-సీతక్క 6 d ago
బిఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని అసెంబ్లీ లో మంత్రి సీతక్క విమర్శించారు. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు మాకు వారసత్వంగా ఇచ్చారని, 2014 నుంచి సర్పంచ్ బిల్లులుపెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. సర్పంచ్ పెండింగ్ బిల్లులు గతంలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లనే..సర్పంచ్లకు బిల్లులు పెండింగ్లో పడ్డాయని సీతక్క వ్యాఖ్యానించారు. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒక్క సంతకం పెట్టుంటే అన్ని క్లియర్ అయ్యేవని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లు విడుదల చేసిందని సీతక్క తెలిపారు.